చిత్ర కళాప్రదర్శనకు గోల్డ్‌ మెడల్‌ | - | Sakshi
Sakshi News home page

చిత్ర కళాప్రదర్శనకు గోల్డ్‌ మెడల్‌

Jan 7 2026 7:35 AM | Updated on Jan 7 2026 7:35 AM

చిత్ర

చిత్ర కళాప్రదర్శనకు గోల్డ్‌ మెడల్‌

చినగంజాం: గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనలో చినగంజానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సూరిబోయిన శ్రీనివాసరెడ్డి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ నెల 3,4,5 తేదీల్లో గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్‌ సిటీలోని నందమూరి తారకరామారావు వేదికపై నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో సంక్రాంతి పండుగ వేడుకల్లో యువతుల ముగ్గులు అనే చిత్రకళకు ఈ గౌరవం దక్కిందని మంగళవారం ఆయన తెలిపారు. శ్రీనివాసరెడ్డి గోల్డ్‌ మెడల్‌ సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.

చిత్ర కళాప్రదర్శనకు గోల్డ్‌ మెడల్‌ 1
1/1

చిత్ర కళాప్రదర్శనకు గోల్డ్‌ మెడల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement