లారీ ఢీ కొని వ్యక్తి మృతి
కర్లపాలెం: నడిచి వెళుతున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి లారీ ఢీ కొనటంతో ఆ వ్యక్తి మృతి చెందిన సంఘటన పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. చందోలు ఎస్‌ఐ ఎంవీ శివకుమార్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు కర్లపాలెం మండలం శ్రీరామ్‌నగర్ గ్రామానికి చెందిన పిట్టు వెంకటశివారెడ్డి(45) అనారోగ్యంతో తమ గ్రామ సమీపంలోని పిట్టలవానిపాలెం మండల పరిధిలో ఉన్న హాస్పటల్‌కు వెళ్ళి వైద్యం చేయించుకుని తిరిగి తమ గ్రామం వెళుతుండగా ఒడిశా నుంచి వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొనటంతో అతనికి తీవ్ర గాయాలయి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


