డబ్బులు ఇస్తేనే లోను ఇస్తారంట!
జె.పంగులూరు: ఉన్నతి రుణాలు అందరికీ సక్రమంగా రాయడం లేదని.. ఏ రుణం తీసుకోవాలన్నా.. డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని డ్వాక్రా మహిళలు వాపోయారు. డ్వాక్రా మహిళల స్థితిగతులు తెలుసుకోవాడానికి వచ్చిన బాంకు లింకేజీ అడిషనల్ డైరెక్టర్ రమ ముందు చందలూరు దళిత కాలనీ డ్వాక్రా మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం సాయంత్రం చందలూరులో వారితో భేటీ అయిన అడిషనల్ డైరెక్టర్ రమ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధికి, వారి జీవనోపాధిలో అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అయితే సభ్యులకు పుస్తకాలు రాసినందుకు గాని, లోన్లు మంజూరు చేయించినందుకు గానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. డ్వాక్రా మహిళల డబ్బులతోనే సీ్త్రనిధి బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీఎం పి. కోటేశ్వరరావు, చందలూరు క్లస్టర్ సీసీ చంద్రశేఖర్, వీవోఏలు పాల్గొన్నారు.
కార్టూనిస్ట్ సుభానీకి ‘బాపు’ అవార్డు
కారంచేడు: ప్రముఖ కార్టూనిస్ట్‌గా, అనతికాలంలోనే కార్టూన్ ఎడిటర్‌గా అంచలంచలుగా ఎదిగిన పొలిటికల్ కార్టూనిస్ట్ షేక్ సుభానీకి ‘బాపు అవార్డు’ దక్కింది. కారంచేడు గ్రామానికి చెందిన సుభానీ షేక్ గత 40 సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని డెక్కన్ క్రానికల్ దినపత్రికలో కార్టూనిస్ట్‌గా పనిచేశారు. కార్టూన్ ఎడిటర్‌గా.. ఎన్నో పొలిటికల్ కార్టూలను వేసి అనేక మంది మన్ననలు పొందారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఆయన అనేక అవార్డులు తీసుకున్నారు. దీంతో హైదరాబాద్‌లోని బాపు–రమణ అకాడమీ వారు గుర్తించి సుభానీకి బాపు అవార్డును అందించారు. నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కవి, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు రమణ అవార్డు, సినీ నటుడు మురళీమోహన్‌కు జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
డబ్బులు ఇస్తేనే లోను ఇస్తారంట!


