పోలీస్ ఉద్యోగం అంటేనే సేవ
బాపట్ల టౌన్: పోలీస్ ఉద్యోగం అంటేనే సేవ అని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లాలో కానిస్టేబుళ్లుగా ఎన్నికై న 191 మందికి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ నిర్వహించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు మొత్తం 5,757 మంది ఎంపిక కాగా, వారిలో బాపట్ల జిల్లా నుంచి 191 మంది ఉన్నారన్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాకుండా, ప్రజలకు శాంతి భద్రతలు కల్పించే అంకితభావంతో కూడిన సేవ అని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆలోచనా ధోరణిని మార్చుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.విజయసారథి, ఎస్‌బీ సీఐ జి.నారాయణ, అడ్మిన్ ఆర్‌ఐ షేక్ మౌలుద్దీన్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
పోలీస్ ఉద్యోగం అంటేనే సేవ


