పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకల పోస్టర్‌ను బుధవారం వీసీ డాక్టర్ జి. పార్థసారథి వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1996–2000 సంవత్సరాల మధ్య విద్యనభ్యసించిన విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు. వేడుకలు విజయవంతం కావడానికి అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల విభాగం డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ కావ్య, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్‌రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రిన్సిపల్ ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆలయ ఎగువ దిగువ సన్నిధులు, శ్రీ గండాలయస్వామి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలి పారు. ఈ మేరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక బ్యానర్లను ఏర్పాటు చేశారు. కొండపై గల శ్రీ గండాలయస్వామి వారిని దర్శించి దీపం పెట్టే భక్తులు వారి వెంట తీసుకువచ్చే ప్లాస్టిక బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు తిరిగి వారితోపాటే తీసుకువెళ్లాలని సూచించారు. భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను కొండపై వదిలి వెళ్లరాదని ఆయన కోరారు. దేవాలయ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పేర్కొన్నారు.
కారంచేడు: బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన 103 సంవత్సరాల శతాధిక వృద్ధుడు బుధవారం మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన మృతితో గ్రామంలోని పాలేటి వారి బజారులో విషాదఛాయలు అలముకున్నాయి. మండల కేంద్రమైన కారంచేడు గ్రామానికి చెందిన పాలేటి సుబ్బారావు (103)కు 92 సంవత్సరాల భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మనవలు, మనవరాళ్లు, ముదిమనవలతో కలిపి సుమారు 20 మందికి పైగా సంతానం ఉన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సుబ్బారావు అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు.
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ సమాచార ప్రసార కేంద్రం నేతృత్వంలో నూనె గింజల పంటల్లో కలుపు యాజమాన్యంపై పుస్తకాల విడుదల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మి దేవి మాట్లాడుతూ రైతులు క్షేత్రస్థాయిలో చీడపీడలను గుర్తించి, సరైన యాజమాన్య చర్యలు చేపట్టేటట్లు సరళంగా, పుస్తకాలను రూపొందించినట్లు తెలిపారు. వీఆటి రూపకల్పనలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను ఆమె అభినందించారు. రైతులు ఈ పుస్తకాలను సద్వినియోగించుకుని మంచి దిగుబడులు సాధించాలని శారదజయలక్ష్మి దేవి కోరారు.
పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ


