ప్రేమ,దయకు ప్రతిరూపమే ఏసుక్రీస్తు
డీఆర్వో జి. గంగాధర్
బాపట్ల టౌన్: ప్రేమ, దయకు ప్రతిరూపమే ఏసుక్రీస్తు డీఆర్వో జి. గంగాధర్ గౌడ్ తెలిపారు. కలెక్టరేట్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు బుధవారం నిర్వహించారు. తొలుత డీఆర్వో క్రిస్మస్ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ క్రిస్మస్ సంతోషాలు అందరి జీవితాల్లో వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అందరితో సమాధానం కలిగి ఉండాలని చెప్పారు. కుల, మత భేషజాలు మాని సోదరభావంతో కలిసి ఉండాలన్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడమే సమానత్వం పాటించడమన్నారు. మంచి మనసుతో ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు తెలిపారు. అందరికీ ఆయన ప్రేమను పంచి పెట్టారని, అదే మాదిరిగా భేదాభిప్రాయాలు లేకుండా సమానత్వంతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని జిల్లా సమాచార సంబంధాల శాఖ సహాయ సంచాలకులు వెంకటరమణ తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


