బాపట్ల
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 41.9800 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 571.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 20,654 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
చంద్రబాబు పాలనలో కూలీలు, రైతులకు అవస్థలు
వేమూరు(అమర్తలూరు): వ్యవసాయంలో యంత్రాల వల్ల కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు తెలిపారు. అమర్తలూరు మండలంలోని కూచిపూడిలో బుధవారం ఆయన పొలాల్లో విత్తనాలు వేస్తున్న కూలీలతో మాట్లాడారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్లాడుతూ యంత్రాల వల్ల సక్రమంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. రైతులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు. కౌలు రైతులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. సొంత పొలాలున్న రైతుల అకౌంట్‌లో మాత్రమే డబ్బులు జమ చేశారని, తమ గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరికి గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయామని, రబీలో జొన్న సాగు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి, జొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని కౌలు రైతులు కోరారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ వైస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రైతులకు, కౌలు రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. మాజీ ముఖ్యమంతిర పాలనలో ప్రతి పంటకు గిట్టబాటు ధర కల్పించడం వల్ల రైతులకు, కౌలు రైతులకు మేలు జరిగిందని పేర్కొన్నారు. పంట సాగు కోసం రైతులకు విడతల వారికి అకౌంట్‌లో డబ్బులు చేశారని, అప్పులు చేయకుండా పొలాలు సక్రమంగా సాగు చేస్తుకున్నారని ఆయన గుర్తుకు తెచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం మహిళలను కూడా మోసం చేసిందని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆర్థికావృద్ధి సాధించారని, పలు పథకాల ద్వారా ఆదుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో పనులు లేక, ప్రభుత్వ పథకాలు అందక నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. మహిళలంతా జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉండాలని కోరారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి సయ్యద్ సిరాజుద్దీన్, దాసరి కిరణ్ ఉన్నారు.
7
వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


