విద్యుత్‌ను పొదుపుగా వాడండి
బాపట్ల: విద్యుత్ పొదుపుగా వాడి భావితరాలకు వెలుగులు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ప్రజలకు సూచించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యుత్ శాఖ రూపొందించిన వాల్‌పోస్టర్‌లను కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ ఇంధనాన్ని పొదుపుగా వాడాలన్నారు. విద్యుత్‌ను దుర్వినియోగం చేస్తే భావితరాలకు అంధకారం మిగులుతుందని చెప్పారు. సౌర విద్యుత్ వినియోగంపై ప్రజలను చైతన్య పర్చాలన్నారు. విద్యుత్ ఎలా పొదుపు చేయాలనే అంశంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విద్యుత్ శాఖ ఉద్యోగులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు, నినాదాలతో ప్రదర్శన పట్టణంలో సాగింది. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఆంజనేయులు, ఈఈ పీవీఆర్ మల్లికార్జునరావు, ఈఈ జి.భాస్కరరావు, ఈఈ పి.హుస్సేన్ ఖాన్, ఏఓ పి.శ్రీనివాసరెడ్డి, డీఈ టి.శ్రీనివాసరావు, ఇంజినీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


