విలువలతో కూడిన నాయకత్వం అవసరం | - | Sakshi
Sakshi News home page

విలువలతో కూడిన నాయకత్వం అవసరం

Oct 18 2025 6:47 AM | Updated on Oct 18 2025 6:47 AM

విలువలతో కూడిన నాయకత్వం అవసరం

విలువలతో కూడిన నాయకత్వం అవసరం

విలువలతో కూడిన నాయకత్వం అవసరం

చేబ్రోలు: విద్య కేవలం జ్ఞాన సంపాదనకే కాకుండా విలువలతో కూడిన నాయకత్వం పెంచుకోవడానికి కూడా ముఖ్యమని ఐసీఎస్‌ఎస్‌ఆర్‌–ఎస్‌ఆర్‌సీ హానరరీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.సుధాకర్‌రెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ‘‘కల్టివేటింగ్‌ ఎథికల్‌ బిజినెస్‌ లీడర్స్‌’’పై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రొఫెసర్‌ బి.సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నప్పుడు సామాజిక బాధ్యతతో కూడిన నైతిక విలువలే మార్గదర్శకాలు కావాలని సూచించారు. ఉస్మానియా వర్సిటీ మాజీ డీన్‌ ప్రొఫెసర్‌ ఎ. సూర్యనారాయణ మాట్లాడుతూ ఆధునిక సంస్థల్లో ఎదురయ్యే నైతిక సమస్యలను ఆచరణాత్మక కోణంలో విశ్లేషించారు. పుదుచ్చేరి యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్‌ యార్లగడ్డ శ్రీనివాసులు భారతీయ తత్వశాస్త్ర సంప్రదాయాల ప్రాధాన్యతను నైతిక నాయకత్వ అభివృద్ధితో అనుసంధానించి వివరించారు. ఐఐటీ హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఎం.పి.గణేష్‌ ఆధునిక అభివృద్ధి తత్త్వాలతోపాటు ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని సమన్వయం చేయడం ఎంత అవసరమో వెల్లడించారు. వంద మందికిపైగా ప్రతినిధులు పరిశోధన పత్రాలను సమర్పించారు. వైస్‌ చాన్సలర్‌ పి.నాగభూషణ్‌, రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు, డీన్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement