
సమయస్ఫూర్తితో ఆటల్లో విజయం
కర్లపాలెం: క్రీడాకారులు సమయస్ఫూర్తితో ఆడి విజయం సాధించాలని డీఈవో పురుషోత్తం తెలిపారు. మండలంలోని యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాపట్ల డివిజన్ స్థాయిలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈవో పురుషోత్తం ముందుగా వాలీబాల్ క్రీడాకారులను, వ్యాయామ ఉపాధ్యాయులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపే ధ్యేయంగా ఆడాలని సూచించారు. నిష్పక్షపాతంగా పోటీలు నిర్వహించాలని వ్యాయామ ఉపాధ్యాయులకు చెప్పారు. పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిని డివిజన్ స్థాయి టీమ్‌కు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సుగుణ మణి, వ్యాయామ ఉపాధ్యాయురాలు మెర్సీ, ఎంఈవోలు మనోరంజని, విజయశ్రీ, స్కూల్ గేమ్ ఫెడరేషన్ మాజీ కార్యదర్శి కరిముల్లా, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతిమ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పోటీల్లో పాల్గొన్న 40 టీములు
బాపట్ల డివిజన్ పరిధిలోని మొత్తం 12 మండలాల నుంచి అండర్–14, అండర్–17 బాలబాలికల విభాగాలలో మొత్తం 40 టీమ్‌లు పాల్గొన్నాయి.