
రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వకు చర్యలు
ఆధార్ కార్డు తీసుకోవాలి
భూసేకరణ పనులలో వేగం పెంచండి
బాపట్ల: గుండ్లకమ్మ ప్రాజెక్ట్ భూసేకరణ పనులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టుపై సంబంధితశాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.
ప్రాజెక్ట్ కింద 50 ఎకరాల భూసేకరణ చేయకపోవడంతోనే జిల్లాలో 13,876 ఎకరాలకు సాగునీరు రావడం లేదని కలెక్టర్ చెప్పారు. ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలో 50 ఎకరాల భూసేకరణ పనులు నిలిచిపోవడంపై ఆరా తీశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ 14 గేట్లు మరమ్మతులు పూర్తి కాగా, మిగతా పనులు జరుగుతున్నాయన్నారు. వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. తాజాగా జిల్లాలో 2,600 ఎకరాల ఆయకట్టు పరిధిలోకి తీసుకురావడానికి గజిట్ విడుదల చేయాల్సి ఉందన్నారు. మరో 78 ఎకరాలు ఆయకట్టులోకి తెచ్చేందుకు అధికారులు పరిశీలన చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ వారంలో పూర్తి చేయాలన్నారు. కొరిశపాడు, అద్దంకి మండలాలలోని మూడు గ్రామాలలో 1,100 కుటుంబాలకు పునరావాసం కింద ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆర్డీవో, తహసీఅల్దారులకు సూచించారు. ప్రాజెక్టు ఎస్‌ఈ అబూతలీమ్, ఆర్డీవో చంద్రశేఖర్, ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
బాపట్ల: పరిశ్రమల భాగస్వాముల ప్రేరణ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సదస్సును పురస్కరించుకొని రూపొందించిన గోడ పత్రాలను గురువారం కలెక్టరేట్లో ఆయన విడుదల చేశారు. పెట్టుబడిదారుల భాగస్వాముల సదస్సు నవంబర్ 14, 15వ తేదీలలో విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని కలెక్టర్ చెప్పారు. అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
బాపట్ల: ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఆధార్ కార్డుల నమోదు, నవీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో తక్షణమే ఈ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో 110 ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 80 మాత్రమే పని చేయడంపై ఆరా తీశారు. సచివాలయాలలో బదిలీల ప్రక్రియ నేపథ్యంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలే కారణమని ఆధార్ కార్డుల రీజినల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. డీఆర్‌వో జి.గంగాధర్ గౌడ్, డీఈవో పురుషోత్తం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పి.డి. రాధా మాధవి, డీపీఓ ప్రభాకర్ రావు, ఆధార్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్ బాబు, కామన్ సర్వీస్ సెంటర్ మేనేజర్ వందనం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్