
కబడ్డీ టోర్నీలో క్రీడాకారిణుల ప్రతిభ
గుంటూరు రూరల్: నగర శివారు లాంలోని చలపతి ఫార్మసీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల కబడ్డీ టోర్నమెంట్ రెండో రోజు శుక్రవారం పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ కళాశాలల జట్లు ప్రతిభ చాటాయి. నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తెనాలి జె.ఎం.జె. డిగ్రీ కళాశాల, గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ సైన్‌న్స్ విభాగం, గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు వరుసగా తొలి నాలుగు స్థానాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. అనంతరం బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగా కోఆర్డినేటర్ డాక్టర్ డి. సూర్యనారాయణ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్, చలపతి విద్యాసంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు తదితరులు విజేతలను అభినందించారు.