
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి
గాదె మధుసూదన రెడ్డి
● ‘కోటి సంతకాల సేకరణ’
కార్యక్రమం ప్రారంభం
ఇంకొల్లు(చినగంజాం): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కచ్చితంగా అడ్డుకుంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పోస్టరును ఆయన ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని తన నివాసంలో గురువారం ఆవిష్కరించారు. అనంతరం తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని, పేద విద్యార్థులకు ఉచిత వైద్యవిద్య అవకాశాలు కల్పించాలని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను చేపట్టిన విషయం గుర్తుచేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. వైఎస్ జగన్‌మోహన రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఇంకొల్లు మండల కన్వీనర్ చిన్ని పూర్ణారావు, యద్దనపూడి మండల కన్వీనర్ రావూరి వేణుబాబు, పర్చూరు మండల కన్వీనర్ కఠారి అప్పారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్, నియోజక వర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, కొల్లా వెంకట సుబ్బారావు చౌదరి, నియోజక వర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు మువ్వల రాంబాబు, బూరగ రాము, పల్లెపోగు ప్రసాద్, పులగం చందు, గోపతోటి బాబురావు, వెన్ను సురేష్, కరి వాసు, గూంటూరు శ్రీను, చిగురుపాటి శ్రీను, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాటి లక్ష్మణ్, నక్కా పోతిరెడ్డి, దొడ్డా రవి, దాసరి వెంకటరావు, సవరపు వందనం, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.