
విజ్ఞాన్ ఫార్మసీ అవగాహన ఒప్పందం
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఫార్మసీ కళాశాల, అమెరికాలోని టెంపుల్ యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని చైర్మన్ లావు రత్తయ్య సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెంపుల్ వర్సిటీతో ఫార్మాడీ ప్రోగ్రామ్‌కు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశంలోని మొదటి సంస్థగా తమ కళాశాల గుర్తింపు పొందిందన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, సాంస్కృతిక, ఇంటర్ డిసిప్లనరీ అవగాహనను పెంచనున్నామన్నారు. ఒప్పందాన్ని సాధ్య మయ్యేలా కృషి చేసినందుకు ఫార్మాడీ ప్రోగ్రాం డీన్ డాక్టర్ సతీష్ ఎస్. గొట్టిపాటిని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ శ్రీకృష్ణ దేవరాయలు, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.