కొల్లూరు : ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించడంతో కూటమి ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. విచ్చల విడిగా వినియోగిస్తున్న క్యారీ బ్యాగ్‌ల కారణంగా ఓ మూగ జీవి ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన కొల్లూరులో చోటు చేసుకుంది. కొల్లూరు గౌడపాలేనికి చెందిన మార్గన బాలాజీ రెండు నెలల కిందట రేపల్లె నుంచి వీధుల్లో తిరిగే ఆవును కొనుగోలు చేసి పోషిస్తున్నాడు. నెల రోజుల కిందట దూడ కూడా పుట్టింది. అయితే, ఆవు మేత తినకుండా మందకొడిగా ఉంటోంది. ఆందోళనకు గురైన యజమాని కొల్లూరు పశువైద్యాధికారిని సంప్రదించాడు. శనివారం గోవును పరిశీలించిన పశువైద్యాధికారి యశ్వంత్ పొట్ట గట్టిగా రాయిలా ఉండటంతో అనుమానం వచ్చి శస్త్ర చికిత్స చేశారు. గంటల కొద్దీ శ్రమించి కడుపులో ఉన్న 54.70 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అనంతరం ఆవు ప్రాణాపాయ స్థితి నుంచి సాధారణ స్థితికి చేరుకోవడంతో వైద్యాధికారిని స్థానికులు అభినందించారు.
క్రోసూరు: పిడుగుపాటులో ఇంటి స్లాబ్ పాక్షికంగా ధ్వంసమైన ఘటన శనివారం వేకువజామున చోటుచేసుకుంది. క్రోసూరులోని కటకం కల్యాణ మండపం ఎదురు బజారు(కొత్తూరు)లో షేక్ నాగూరు ఉంటున్నాడు. తెల్లవారుజామున ఇంటిపై పిడుగు పడింది. దాని ధాటికి ఇంటి వరండా స్లాబ్ బీటలు వారింది. విద్యుత్ మీటర్ కాలిపోయింది. ఫ్రిజ్, ఫ్యాన్లు, వాషింగ్ మిషన్లు పూర్తిగా పాడయ్యాయి. ఇంటి ముందున్న విద్యుత్ స్తంభం తీగలు తెగిపడిపోయాయి. అంతేకాకుండా అదే వీధిలోని అనేక మంది ఇళ్లలో విద్యుత్ పరికరాలు, నీళ్ల మోటార్లు, టీవీలు పాడయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని మాజీ శాసనసభ్యుడు నంబూరు శంకరావు సందర్శించి, బాధితుడిని పరామర్శించారు. వీఆర్వో లేళ్ల బ్రహ్మనాయుడు బాధితుడి నుంచి వివరాలు సేకరించారు.
మంగళగిరి టౌన్: మహిళలు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, దీనికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డి. శ్రీనివాసకుమారి పిలుపునిచ్చారు. మంగళగిరి నగర పరిధిలోని ఐద్వా కార్యాలయంలో శనివారం గుంటూరు జిల్లా 12వ మహాసభను నిర్వహించారు. ఐద్వా జెండాను ఆవిష్కరించిన అనంతరం శ్రీనివాసకుమారి మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై మహిళలు ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలని చెప్పారు. తొలుత మహిళా ఉద్యమంలో అమరులైన మల్లు స్వరాజ్యం, మోటూరు ఉదయం, మానికొండ సూర్యావతి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రామిక జిల్లా మహిళా కన్వీనర్ అరుణ, ఐద్వా జిల్లా నాయకురాలు సుధా కిరణ్, జిల్లా మాజీ కార్యదర్శి ప్రమీల, మంగళగిరి రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు సంధ్య, విజయలక్ష్మి, సభ్యులు పద్మ, గిరిజ, కల్యాణి పాల్గొన్నారు.
జిల్లా ఐద్వా కమిటీఎంపిక
మహాసభలో గుంటూరు జిల్లా ఐద్వా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కె. పద్మ, కార్యదర్శిగా అరుణ, సహాయ కార్యదర్శులుగా గిరిజ, సుమ, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసకుమారితో పాటు 15 మందితో కమిటీ ఎన్నికై ంది.
ఆవు కడుపులో 55 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
ఆవు కడుపులో 55 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు