
కూలిన ఆలేరు రిటైనింగ్ వాల్
ఇంకొల్లు(చినగంజాం): మండలంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆలేరు సర్‌ప్లస్‌కు సంబంధించిన రిటైనింగ్ వాల్ కూలిపోయింది. నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన వర్షపు నీటి ఉధృతి కారణంగా ఒక రిటైనింగ్ వాల్ కూలిపోయింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండో రిటైనింగ్ వాల్ శుక్రవారం రాత్రి కూలిపోయింది. రెండువైపులా రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో ఆలేరు సర్‌ప్లస్ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం వర్షపు నీరు ఉధృతంగా ప్రవస్తోంది. ఇప్పటికై నా ఆర్ అండ్ బీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

కూలిన ఆలేరు రిటైనింగ్ వాల్