
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
బాపట్ల టౌన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం ఉదయం మచ్చావారిపాలెం సమీపంలోని 216 జాతీయర హదారిపై చోటుచేసుకుంది. కర్లపాలెం గ్రామానికి చెందిన బొద్దులూరి చిట్టిబాబు(45) సైకిల్‌పై బాపట్ల మండలం చింతావారిపాలెంలో నివాసం ఉంటున్న పిన్ని వద్దకు వెళ్తున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు.