
చిన్నారుల హాజరు శాతం పెంచాలి
కర్లపాలెం: భవిత సెంటర్‌లో చిన్నారుల హాజరు శాతం పెంచాలని సహిత విద్య రాష్ట్ర పరిశీలకులు మల్లికార్జున్ చెప్పారు. కర్లపాలెం పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్‌లో గల భవిత సెంటర్‌ను శుక్రవారం ఆయనతో పాటు సహిత విద్య జిల్లా సమన్వయకర్త జ్యోత్స్న తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు.సెంటర్‌లో చిన్నారులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ చిన్నారుల సంఖ్యను 20కి పెంచాలని తెలిపారు. అడ్మిషన్‌లో ఉన్న చిన్నారులంతా భవిత సెంటర్‌కు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం శైలజ, భవిత సెంటర్ టీచర్లు ఎన్. లక్ష్మీ ప్రసన్న, సీహెచ్. చందన పాల్గొన్నారు.