
ముగిసిన జిల్లాస్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక
చీరాల రూరల్: స్థానిక సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అండర్–19 బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక ప్రక్రియ ముగిసింది. కళాశాల ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజు, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. చింపారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పుష్పరాజు, కరస్పాండెంట్ శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా సత్తా చాటాలని సూచించారు. విజయం కోసం పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. వేటపాలెం బీబీహెచ్ కాలేజీ పీడీ బాపయ్య శెట్టి, పీడీ సుబ్బారెడ్డి, రిటైర్డ్ పీడీ డీసీ విద్యాసాగర్ పాల్గొన్నారు.