
అండర్ – 19 బాలుర ఖోఖో జట్టు ఎంపిక
జె.పంగులూరు: స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్ –19 విభాగంలో బాలుర ఖోఖో జట్టు ఎంపిక చేశారు. జిల్లా నుంచి 40 మంది వచ్చినట్లు కళాశాల పీడీ సీతారామిరెడ్డి తెలిపారు. సీనియర్ క్రీడాకారుడులు షేక్ అహ్మద్, పీడీ రవికిరణ్, వేణు మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన 12 మందిని ఎంపిక చేసిట్లు తెలిపారు. క్రీడాకారులకు ఉమ్మడి ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ ఎం.చింపారెడ్డి, ఆర్‌ఐఓ ఆంజనేయులు అభినందనలు తెలిపారు.
ఎంపికై న క్రీడాకారులు వీరే..
మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కళాశాల నుంచి సీహెచ్. బాబ్జీ, యన్. భరత్ కుమార్, ఐ. ప్రవీణ్ రెడ్డి, పి. నరేష్, డి. విజయ్, సి. లక్ష్మీనారాయణ, సీహెచ్. నాగవర్దన్, ఎం. ఆంజనేయులు, ఐ. అనిల్, కె. మోహన్‌రావు, శ్రీ విద్యానికేతన్ సింగరాయకొండ నుంచి ఏ. రమణ కృష్ణారెడ్డి, సాయిబాబు చైతన్య జూనియర్ కళాశాల నుంచి ఆర్. విఖ్యాత్ రెడ్డి ఎంపికయ్యారు.
స్టాండ్ బై క్రీడాకారులు
మాగుంట సుబ్బారామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల నుంచి ఎం. దానియేలు, సి. శివ ప్రసాద్, బి. గోపీచంద్ స్టాండ్ బైగా ఎంపికయ్యారు.