
ఏఆర్‌టీ సెంటర్ ఏర్పాటు వ్యాధిగ్రస్తులకు వరం
అద్దంకి: స్థానిక సీహెచ్‌సీలో ఏఆర్‌టీ సెంటర్ ఏర్పాటు క్షయ వ్యాధిగ్రస్తులకు వరమని బాపట్ల జిల్లా క్షయ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సోమల నాయక్ అన్నారు. సీహెచ్‌లో ఏఆర్‌టీ సెంటర్ ఏర్పాటు చేయనున్న దృష్ట్యా గురువారం సందర్శించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె. కె. వాహిలా చౌదరి, బాపట్ల జిల్లా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ సమీకృత వ్యూహం, దిషా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ సయ్యద్ జానీ బాషా, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ టీఐ ప్రాజెక్టర్ బీవీ సాగర్‌తో కలిసి హాస్పిటల్లో కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సోమల నాయక్ మాట్లాడుతూ హాస్పిటల్‌కి వచ్చే హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా గదులను ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో శాశ్వత భవనాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో 1,300కు పైగా ఉన్న హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఏఆర్‌టీ సెంటర్ ఉపయోగపడుతుందని చెప్పారు. గతంలో వ్యాధిగ్రస్తులు మందుల కోసం ఒంగోలు వెళ్లాల్సి వచ్చేదన్నారు. కొన్నిసార్లు రవాణా చార్జీలు లేక ఇతర కారణాల ద్వారా మందులు మధ్యలో ఆపివేస్తుండటంతో ఆరోగ్యం క్షీణించి మరణానికి దగ్గరవుతున్నారని తెలిపారు. అద్దంకిలోనే ఏఆర్టీ సెంటర్ తీసుకురావడం ద్వారా వారు క్రమం తప్పకుండా మందులు వాడుకునే అవకాశం ఉంటుందని, త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేస్తామని సోమల నాయక్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్. తేజస్విని, డాక్టర్ అనిత జ్యోతి, ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్, పారా మెడికల్ ఆఫీసర్ ఎన్. శ్రీనివాసరావు, బి. దుర్గ సురేంద్ర, ఔట్ రీచ్ వర్కర్ దుర్గాభవాని పాల్గొన్నారు.
జిల్లా క్షయ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సోమల నాయక్