మా ఆత్మగౌరవాన్ని కాపాడండి ! | - | Sakshi
Sakshi News home page

మా ఆత్మగౌరవాన్ని కాపాడండి !

Oct 10 2025 6:32 AM | Updated on Oct 10 2025 6:32 AM

మా ఆత్మగౌరవాన్ని  కాపాడండి  !

మా ఆత్మగౌరవాన్ని కాపాడండి !

ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ మహిళలకు గౌరవం లేదు

పిడుగురాళ్ల: తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని సచివాలయ ఉద్యోగులు మొర పెట్టుకుంటున్నారు. సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతూ తమతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని వాపోతున్నారు. వీటితోపాటు తమ ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోతే ఈ నెల 19న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వలంటీర్లను తొలగించటంతో ఆ విధుల భారాన్ని తమపై మోపారన్నారు. జాబ్‌ చార్ట్‌ ఇవ్వాలని కోరారు. పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఇప్పటికీ ఏ శాఖలో పని చేస్తున్నామో అర్థం కావటం లేదు. రేషలైజేషన్‌ ప్రక్రియతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.

– నరసింహారావు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రామ,

వార్డు సచివాలయ కన్వీనర్‌

సచివాలయాల్లో పని చేస్తున్న మహిళలకు గౌరవం లేకుండాపోతోంది. శానిటరీ సెక్షన్‌లో పనిచేసే సచివాలయ ఉద్యోగులకు తెల్లవారుజామున 4 గంటలకు రోడ్లపై విధులు కేటాయిస్తున్నారు. కార్యాలయాల్లో వసతులు కూడా లేవు.

– దీప్తి, మహిళా పోలీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement