
బాపట్ల జిల్లా జేసీగా భావన వశిష్ట్
బాపట్ల టౌన్: బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి భావన వశిష్ట్‌ను నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ ప్రారంభించిన ఆమె తరువాత పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. జీఎస్‌డబ్ల్యూఎస్ అడిషనల్ డైరెక్టర్‌గానూ సేవలందించారు. ఎన్నికలకు ముందు అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. గడిచిన 15 నెలలుగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజా ఉత్తర్వుల్లో భాగంగా బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.