కొల్లూరు: కృష్ణా నదిలో ఇసుక అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని చింతర్లంక పరిధిలోని కృష్ణా నది నుంచి అధిక సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేపడతున్నట్లు అందిన సమాచారంతో తహసీల్దార్, రెవెన్యు సిబ్బంది, ఎస్‌ఐ జానకి అమరవర్ధన్‌తో కలసి నదిలోకి వెళ్లి పరిశీలించారు. ఆకస్మిక తనిఖీల సమయంలో నదిలో సుమారు 40 వరకు ట్రాక్టర్లు ఉండటాన్ని గమనించిన తహసీల్దార్, ఎస్‌ఐలు ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. దీంతో ట్రాక్టర్లలో నింపుకొన్న ఇసుకను వాహనదారులు నదిలో అన్‌లోడ్ చేసి వెనుతిరిగారు. తనిఖీల సమయంలో ఇసుక నింపుకొని వెళుతున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కొల్లూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు