
లోక్ అదాలత్‌లో 643 కేసులకు పరిష్కారం
రేపల్లె(చెరుకుపల్లి): మండల న్యాయ సేవాధికార సంస్థ, సీనియర్ సివిల్ జడ్జి రేపల్లె కార్యాలయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 643 కేసులు పరిష్కరించినట్లు రేపల్లె సబ్ కోర్టు, పీడీఎం కోర్టు జడ్జీలు వెన్నెల, శ్రీవాణి తెలిపారు. ఇందులో సివిల్ –44, క్రిమినల్–599 కేసులు ఉన్నట్లు చెప్పారు. కేసులు పరిష్కారానికి రెండు బెంచ్‌లు ఏర్పాటు చేశారని తెలిపారు. కేసుల పరిష్కారంలో ఇద్దరు జడ్జీలతో పాటు న్యాయవాదులు డి.ఎస్. హరికుమార్, యు.శ్రీనివాసరావులు లోక్ అదాలత్ సభ్యులుగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. కేసుల పరిష్కారంలో కక్షిదారులకు రూ. 1.13 కోట్ల లబ్ధి చేకూరిందని వివరించారు. కార్యక్రమంలో పోలీసులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.