
ఎన్జీవో సంఘం జిల్లా కొత్త కమిటీ ఏర్పాటుకు కృషి
బాపట్ల:బాపట్ల జిల్లా ఎన్జీవో సంఘం నూతన కమిటి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ పేర్కొన్నారు. బాపట్లలోని ఎన్జీవో అసోసియేషన్ హాలులో శుక్రవారం సమావేశం నిర్వహించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగస్తుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి డి.వి.రమణ, గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఘంటసాల శ్రీనివాసరావు, శ్యామసుందర్ శ్రీనివాస్, ప్రకాశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే శరత్‌బాబు, ఆర్‌సీహెచ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
అడహాక్ కమిటీ ఏర్పాటు
ఏపీ ఎన్జీవో బాపట్ల జిల్లా అడహాక్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా పి.నాగేశ్వరరావు, కన్వీనర్ గా బి.ప్రసాదరావు, ట్రెజరర్‌గా బి.రాజేష్, సభ్యులుగా డి.నాగేశ్వరరావు, సిహెచ్. శేషుబాబు, జి.కిరణ్ కుమార్, కే.సృజనకుమారిలను నియమించారు. వీరి ఆధ్వర్యంలో జిల్లాలో ఉద్యోగుల సభ్యత్వ నమోదు పూర్తి చేసి బాపట్ల జిల్లా పరిధిలోని ఏడు తాలూకాలు బాపట్ల, చెరుకుపల్లి, రేపల్లె, చీరాల, అద్దంకి, పర్చూరు, మార్టూరు తాలూకాల ఎన్నికలను పూర్తిచేసి తరువాత నవంబర్ నెల చివరిలోపు బాపట్ల జిల్లా శాఖ నూతన జిల్లా కార్యవర్గం ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్