బాపట్ల అర్బన్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆటో డ్రైవర్ల జీవనానికి ముప్పుగా మారిందని కార్మికశక్తి ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గొలపల పూర్ణచంద్రరావు అన్నారు. శుక్రవారం ఆటోల ర్యాలీ అనంతరం వర్కర్లు పట్టణంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో మహిళ ఉచిత ప్రయాణం కొంతమేర మంచిదే అయినప్పటికీ ఆటోలనే నమ్ముకుని ఉపాధి పొందుతున్న వర్కర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆటో కార్మికులకు భారంగా మారిన బీమా, ఆర్టీఏ చలానాలు రద్దు చేయాలన్నారు. విపరీతంగా పెరిగిన ఆటో స్పేర్ పార్టుల ధరలపై రాయితీ ఇవ్వాలి. ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అర్హులైన ఆటో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి ఆర్.టి.సి.లో డ్రైవర్లు, కండక్టర్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ మేరకు తహసీల్దార్ సలీమాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 589.00 అడుగులకు చేరింది. ఇది 309.0570 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 9,500, ఎడమకాలువకు 7,029, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 32,886, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరదకాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 52,115 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 52,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
ఆటో డ్రైవర్లకు కష్టాలు