వైఎస్సార్‌సీపీ విద్యార్థి, ఎస్సీ విభాగాల కమిటీలు నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ విద్యార్థి, ఎస్సీ విభాగాల కమిటీలు నియామకం

Sep 6 2025 5:21 AM | Updated on Sep 6 2025 5:21 AM

వైఎస్సార్‌సీపీ విద్యార్థి, ఎస్సీ విభాగాల కమిటీలు నియామక

వైఎస్సార్‌సీపీ విద్యార్థి, ఎస్సీ విభాగాల కమిటీలు నియామక

వైఎస్సార్‌సీపీ విద్యార్థి, ఎస్సీ విభాగాల కమిటీలు నియామకం రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య గణేష్‌నిమజ్జనంలో అపశృతి మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి

బాపట్ల టౌన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం బాపట్ల జిల్లా విద్యార్థి, ఎస్సీ విభాగ కమిటీలను నియమించారు. విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా గోసాల అశోక్‌ (చీరాల), మాతి శివకుమార్‌ (వేమూరు)తోపాటు ఆరుగురు జనరల్‌ సెక్రటరీలు, ఏడుగురు సెక్రటరీలు, 15 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమించారు. ఎస్సీ విభాగ కమిటీని నియమించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా జడ విజయ్‌బాబు (అద్దంకి), దున్నా బాబు (వేమూరు)తోపాటు ఏడుగురు జనరల్‌ సెక్రటరీలు, 18 మంది సెక్రటరీలు, నలుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమించారు.

తెనాలి రూరల్‌: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలకలూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు ఘటనాస్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. సుమారు 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. మృతుడు లేత ఆకుపచ్చ చొక్కా, తెలుపు మీద ఎరుపు, నలుపు గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద టర్కీ టవల్‌ ఉండడంతో రైతు అయి ఉంటాడని భావిస్తున్నారు. ఛిద్రమైన మృతదేహం భాగాలను తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిసిన వారు 7207076614 నంబరులో సంప్రదించాలని ఎస్‌ఐ జి. వెంకటాద్రిబాబు సూచించారు.

గుండెపోటుతో వ్యక్తిమృతి

బొల్లాపల్లి: వెల్లటూరులో శుక్రవారం జరిగిన గణేష్‌ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్‌పార్టీ కార్యకర్త గంగనబోయిన గోవిందరాజులు (29) శుక్రవారం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు గోవిందరాజులుకు భార్య భూలక్ష్మితోపాటు ఇరువురు సంతానం ఉన్నారు. మృతుని కుటుంబాన్ని స్థానిక వైఎస్సార్‌ పార్టీ నాయకులు పరామర్శించారు.

నరసరావుపేట: గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందని వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్‌ మాట్లాడారు. మాజీ సీఎం జగన్‌ రూ.8,850 కోట్లతో 17 మెడికల్‌ కళాశాలల నిర్మాణాలకు చర్యలు తీసుకోగా అందులో ఐదింటిని పూర్తిచేసి తరగతులు కూడా ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు పావులు కదుపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందించడం ఇష్టంలేని ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్‌ కౌన్సిల్‌కు సీట్లు అవసరం లేదని లేఖ రాశారని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం తెలుగు రాష్ట్ర ప్రజల దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్‌ కళాశాలలు అందుబాటులోకి వస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందనే దుగ్ధతో చంద్రబాబు ఈ పాపానికి వడిగడుతున్నాడన్నారు. ఈ జీఓను వెనక్కి తీసుకోకపోతే పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కోటపాటి మణికంఠారెడ్డి, బూదాల కల్యాణ్‌, ఉప్పతోళ్ల వేణుమాధవ్‌, బంటి, షోయబ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement