
రెండు రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
చీరాల రూరల్: రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం వేటపాలెం–చినగంజాం రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. రైల్వే ట్రాక్‌మెన్ అందించిన సమాచారంతో సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం మూడో నంబర్ లైన్ పక్కన ఉందని.. ఎటువంటి వివరాలు లభించలేదని చెప్పారు. మృతుని వయస్సు వయస్సు 35 సంవత్సరాలు ఉంటాయని చెప్పారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరో సంఘటనలో ...
వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఎస్. సత్యన్నారాయణ (75) అనే వృద్ధుడు తన భార్యతో కలిసి గురువారం సాయంత్రం చినగంజాం రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం దాటుతున్నాడు. ఆ సమయంలో రైలు ఢీకొట్టడంతో మృతి చెందినట్లు ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రెండు రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి