
కూటమి నాయకుల వల్లే యూరియా కొరత
వేమూరు: కూటమి నాయకుల నిల్వ చేసిన యూరియాను అదనపు ధరకు అమ్ముకునేందుకు కొరత సృష్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు అన్నారు. చెరుకపల్లిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజనలో రైతులకు అరకొర యూరియా ఇవ్వడంతో రైతులు యూరియా కోసం నానా బాధలు పడుతతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీలో పెద్ద రైతులు యూరియా నిల్వ చేసుకున్నారని విమర్శించారు. చిన్న రైతులు, కౌలు రైతులు యూరి యా కోసం సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారని అన్నారు. యూరియా కొరత వల్ల పంటకు సకాలంలో వేయకపోవడంతో దిగుబడులు తగ్గుతాయన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు, కౌలు రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ వేమూరు సమన్వయకర్త
వరికూటి అశోక్‌బాబు