
అభివృద్ధితో పట్టణ రూపురేఖల్ని మార్చుతాం
రేపల్లె: అభివృద్ధితో పట్టణ రూపురేఖల్ని మార్చటం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె పట్టణంలో మంగళవారం నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కోట్ల రూపాయల నిధులతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 9, 13, 27, 28 వార్డులలో రూ.1.55 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను ప్రారంభించారు. 2వ వార్డులో రూ.14 లక్షలతో నూతనంగా నిర్మించిన పార్కును, చంద్రమౌళి పార్కులలో రూ.26 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆట పరికరాలను ప్రారంభించారు. ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. పట్టణం నుంచి పేటేరు రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల మేర కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేయనున్న పైప్‌లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో నేలపు రామలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్ కట్టా మంగ, కమిషనర్ కాకర్ల సాంబశివరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, నాయకులు అనగాని శివప్రసాద్, గూడపాటి శ్రీనివాసరావు, పంతాని మురళీధరరావు, జీవీ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
అనగాని సత్యప్రసాద్