
ఎయిడెడ్ అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపిన మాణిక్యరా
చిలకలూరిపేట: ఎయిడెడ్ అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత దివంగత ఎంజే మాణిక్యరావుకు దక్కుతుందని మాజీ ఎమెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు. పూర్వ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు, ఆక్టా నాయకుడు దివంగత ఎంజే మాణిక్యరావు శతజయంతిని పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాలులో రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగభద్రత లేక బానిసల మాదిరి జీవితాలు గడుపుతున్న ఎయిడెడ్ కళాశాల లెక్చరర్ల జీవితాలను చూసి 1972లో రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపునిచ్చారని తెలిపారు. సమ్మె ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులకు ఉద్యోగభద్రత, పెన్షన్ విధానం గవర్నమెంట్ లెక్చరర్లతో సమానంగా లభించాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంజే మాణిక్యరావు మెమో రియల్ కమిటీ కార్యదర్శి డాక్టర్ మోజస్, రిటైర్డ్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శు లు కేవీ కృప్ణారావు, జీఆర్‌కే రెడ్డి, జీవీ రాఘవులు, తోటకూర వెంకటనారాయణ, టి వెంకటేశ్వరరావు, ఎం లక్ష్మీనారాయణ, పీఎస్వీ ప్రసాద్, కె రామారావు, ఆళ్ల వేమనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు