పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం

Sep 2 2025 7:12 AM | Updated on Sep 2 2025 7:12 AM

పొదుప

పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం

జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి

బాపట్ల: పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి తెలిపారు. డీఆర్‌డీఏ ద్వారా పాడి గేదెల పెంపకం యూనిట్ల అమలు తీరుపై సోమవారం స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పొదుపు మహిళలకు పాడి గేదెలు ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తి పెరిగి, ఆర్థిక అభివృద్ధిలోకి పయనిస్తారని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 70 వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 16వేల పొదుపు సంఘాలకు గేదెలు, మేకలు, గొర్రెలు యూనిట్లు స్థాపించాలన్నారు. మిగిలిన వారికి పౌల్ట్రీ, గడ్డి నాటడం వంటి యూనిట్లు మంజూరు చేయాలని ఆదేశించారు. డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధితో లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వీటిల్లో ప్రధానంగా 12,500 గేదెల పెంపకం యూనిట్లు స్థాపించాలని చెప్పారు. ఈ యూనిట్‌లను స్థాపించడానికి సామాజిక పెట్టుబడి నిధి, శ్రీనిధి, ఉన్నతి పథకం, బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సదుపాయం కల్పించాలని తెలిపారు. శ్రీనిధి కింద ఇప్పటికే రూ.260 కోట్ల రుణాలు జిల్లాకు కేటాయించినట్లు వివరించారు. ఇప్పటివరకు 72 గేదెల యూనిట్లను లబ్ధిదారులకు అందించామన్నారు. 25 అరకు కాఫీ సెంటర్లు జిల్లాలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అద్దంకి నియోజకవర్గంలో 2,500 గేదెల యూనిట్లు, పర్చూరులో మూడువేల యూనిట్లు, చీరాలలో వెయ్యి యూనిట్లు, బాపట్లలో 1500, రేపల్లెలో 2000, వేమూరులో 2500 యూనిట్లు సమర్పించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. డిసెంబర్‌ చివరి నాటికి లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ వేణుగోపాల్‌, ఎల్‌డీఎం శివకృష్ణ పాల్గొన్నారు.

పింఛన్ల పంపిణీ సక్రమంగా చేపట్టాలి

పింఛన్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి అన్నారు. బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో ఆయన సోమవారం పింఛన్లు పంపిణీ చేశారు. సిబ్బంది సక్రమంగా పంపిణీ చేస్తున్నారా.. లేదా ?అంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల పంపిణీపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఇద్దరు వితంతు, వృద్ధులు, మంచం పట్టిన వారికి కలెక్టర్‌ చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీవో గ్లోరియా, తహసీల్దార్‌ సలీమా, తదితరులు పాల్గొన్నారు.

పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం 1
1/1

పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement