
ఎకై ్సజ్ అధికారిపై వేటు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాకు కేటాయించిన 19 బార్లకు మద్యం వ్యాపారులతో దరఖాస్తులు వేయించలేదన్న సాకుతో ఎకై ్సజ్ ఉన్నతాధికారులు బాపట్ల జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి వెంకటేశ్వర్లుపై వేటు వేశారు. కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలంటూ సోమవారం ఆదేశించారు. దీంతో ఆయన హుటాహుటిన కమిషనరేట్‌లో రిపోర్టు చేశారు. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎస్‌కే. ఆయేషా బేగంను బాపట్ల ఇన్‌చార్జి ఎకై ్సజ్ అధికారిగా నియమించారు. దీంతో ఆమె సోమవారమే విధుల్లో చేరారు. ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎకై ్సజ్ అధికారిపై వేటు వేయడంపై ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళనతో పాటు ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సిండికేట్‌గా మారిన వ్యాపారులు
పచ్చ బ్యాచ్‌తో కూడిన మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారారు. బార్ల లైసెన్సు, దరఖాస్తు ఫీజులను తగ్గించుకునేందుకు దరఖాస్తులు వేయకుండా బెదిరింపులకు దిగారు. ఎకై ్సజ్ అధికారులు మొరపెట్టుకున్నా కనికరించలేదు. దీంతో బాపట్ల జిల్లాలోని బార్లకు నామమాత్రంగా కూడా దరఖాస్తులు పడలేదు. జిల్లాలో 17 జనరల్ కేటగిరీలో బార్లను మంజూరు చేయగా గీత కార్మికులకు మరో రెండు బార్లు కేటాయించారు. మొత్తం 19 బార్లకు గాను గీత కార్మికుల రెండు బార్లతోపాటు చీరాల, అద్దంకిల పరిధిలోని మరో రెండు బార్లకు మాత్రమే పూర్తిస్థాయిలో దరఖాస్తులు వేశారు. మిగిలిన 15 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా పడలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఎకై ్సజ్ కమిషనరేట్ బాపట్ల జిల్లా ఎకై ్సజ్ అధికారి విఫలమయ్యాడన్న సాకుతో ఆయన్ను సోమవారం కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. మద్యం వ్యాపారులు బార్లకు దరఖాస్తులు వేయకపోతే ఉన్నతాధికారులు జిల్లా ఎకై ్సజ్ అధికారిపై వేటు వేయడంపై సిబ్బంది నుంచి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.