
రెంటచింతలలో చోరీ
బంగారు అభరణాలు..నగదు అపహరణ
రెంటచింతల: రెంటచింతలలోని రేంజర్‌గారి బజారులో జరిగిన భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రేంజర్‌గారి బజారులో నివసిస్తున్న జెట్టిపాలెం ఏపీ మెడల్ స్కూల్ పాఠశాల ఉపాధ్యాయుడు గెల్లిపోగు జనార్ధనరావు మాచర్ల పట్టణంలో ఉంటున్న తన తల్లి మరియమ్మను చూడటానికి శనివారం భార్యతో కలిసి వెళ్లారు. తిరిగి సోమవారం వచ్చే సమయానికి ఇంటి తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో దాచిన 122 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని కారంపూడి సీఐ టీవీ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
సత్తెనపల్లి: జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం గుడిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. బాలుర విభాగంలో 80 మంది, బాలికల విభాగంలో 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెలలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాల్గొంటారని జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మువ్వా నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కోనంకి కిరణ్ కుమార్ తెలిపారు.
బాలుర జట్టుకు: కె.వెంకట్, జి.నవీన్, పి.మోబీన్, బి.రిషి, జి.వెంకటేష్, షేక్.అబ్దుల్, ఎం.హఫీజ్, ఎం.మహీధర్, కె.ప్రవీణ్, జి.మాంజి, కె.సుధీర్, ఎస్.భార్గవ్‌లు ఎంపికయ్యారు.
బాలికల జట్టుకు: యమ్.విజయ పరిమళ, కె.హిమ బిందు, జె.లక్ష్మి కీర్తన, జె.యశస్విని, పి.మేఘన, పి.సుచరిత, ఎం.నందిని, సిహెచ్.అక్షర, కె.హర్షిత, టి.సింధు, ఎం.జ్యోతిక, ఎస్.మధులు ఎంపికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయులు లాకు పిచ్చయ్య, బి.అనీల్‌దత్తానాయక్, షేక్.మెహబూబి, బి.తులసీరామ్‌నాయక్, ఎ.చిన్నయ్య, తిరుపతమ్మ, రత్నాకర్, యమ్.ప్రసన్న, పి.శివరామకృష్ణ ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్
నరసరావుపేటరూరల్: రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల విలువైన ప్రాణాల ను కాపాడేందుకు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లాలో డ్రైవ్ కొనసాగుతుందన్నారు.

రెంటచింతలలో చోరీ