
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి
బాపట్ల అర్బన్: పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ఓఎస్‌డీ వెంకటకృష్ణ పేర్కొన్నారు. బాపట్ల డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇ.టి.సి ప్రిన్సిపాల్ డి.వెంకటరావు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో చొప్పర కృష్ణ, ఇ.ఇ.పీఆర్ వేణుగోపాల్‌రెడ్డి, బాపట్ల, రేపల్లె, చీరాల డి.డి.వొలు విజయలక్ష్మి, పద్మ, పద్మావతి, ఎంపీడీవో బాబురావు, డి.ఇ.పి.ఆర్. పి.రాజన్న, ఏఈ పి.ఆర్.మోహన్‌రావు పాల్గొన్నారు.
బాపట్ల: గ్రామాభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర కీలకమని వెంకటకృష్ణ పేర్కొన్నారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ప్రమోషన్ పొందిన ఎంపీడీవోల ఒక నెల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆయన సూచించారు. శిక్షణ పొందిన ఎంపీడీవోలు వారికి కేటాయించిన మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని కోరారు. ఈటీసీ ప్రిన్సిపాల్ డి.వెంకట్రావు, వైస్ ప్రిన్సిపాల్ పి.పద్మజ, శిక్షణలో 48 మంది ఎంపీడీవోలు పాల్గొన్నారు.