
నిర్లక్ష్యంతో ఇద్దరి మృతి
దాదాపు పది టన్నుల బరువైన రాయి మీద పడటంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే నుజ్జునుజ్జు అయ్యారు. వారి ముఖాలు కూడా సరిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. మృతుల్లో మరో ఇద్దరు దండ బడత్య, ముస్సా జనా తీవ్రగాయాల పాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. తక్షణం ప్రాథమిక వైద్యం అందకనే వారిద్దరూ మృతిచెందారని వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది. వీరిద్దరితో పాటు గాయాలపాలైన ఎం.సుదర్శన్, కె.నాయక్, శివా గౌడ్‌లను నరసరావుపేటకు తరలించే సమయంలో అంబులెన్స్‌లో కాకుండా క్వారీకి సంబంధించిన వాహనాల్లోనే తరలించారు. ఘటనా స్థలంలో మృతిచెందిన నలుగురి మృత దేహాలను నిర్లక్ష్యంగా గ్రానైట్ టిప్పర్‌లో ఆస్పత్రికి తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది. ఇంత పెద్ద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తమ క్వారీలో పనిచేసిన కార్మికుల మృతదేహాలను వెంట ఉండి తీసుకుని రావాల్సిన క్వారీ నిర్వాహకులు అమాన వీయంగా టిప్పర్ బాడీలో మార్చూరీకి తరలించడం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది.

నిర్లక్ష్యంతో ఇద్దరి మృతి