
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
చీరాల రూరల్: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చీరాల రైల్వేస్టేషన్ వద్ద దక్షిణ యార్డు ప్రాంతంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్‌ఐ సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. సుమారు 35 సంవత్సరాలు వయస్సు కలిగిన ఓ వ్యక్తి రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడి శరీరంపై పింక్, బ్లాక్ రంగు కలిగిన గళ్ల చొక్కా, బాంబే స్టైల్స్ టీఎన్‌ఎల్ అనే లేబుల్ ఉన్నట్లు చెప్పారు. బ్లూ కలర్, బ్లాక్ రంగు కలిగిన స్టోర్స్ బెల్ట్ చెప్పులు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు 94406 27646 ఫోను నంబర్‌కు తెలపాలని సూచించారు.