
రాష్ట్ర ఫోర్ బాల్ టోర్నమెంట్ ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవటం ద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చని కే–రిడ్జి పాఠశాల చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం రాష్ట్రస్థాయి అండర్–14, అండర్–19 బాలబాలికల ఫ్లోర్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించిన నాతాని మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. తద్వారా విద్యలోనూ రాణించగలరని తెలిపారు. కాగా, పోటీలలో పాల్గొనేందుకు 16 జిల్లాల నుంచి 250 మంది బాలబాలికలు, జట్లు అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, జిల్లా ఫోర్ బాల్ కార్యదర్శి కిషోర్‌బాబు, ఏపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.సురేంద్ర, వివిధ జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.
పోటీలను ఆరంభించిన కే–రిడ్జి చైర్మన్ నాతాని

రాష్ట్ర ఫోర్ బాల్ టోర్నమెంట్ ప్రారంభం