
పెద్ద రైతులకు ఎక్కువ నష్టం
పెద్దరైతులు ఎక్కువ మొత్తంలో అప్పులు చేసి సాగు చేశారు. ఆ స్థాయిలోనే ఒత్తిడి అధికంగా ఉంది. ఇటు అమ్ముడు పోతుందో లేదో తెలీదు. అది ఎంత ధరకు అమ్ముడౌతుందో తెలీదు. కాని ప్రైవేటుగా తెచ్చిన అప్పులోళ్లకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. యాప్‌లో నాపేరు రిజిస్టర్ చేసి సుమారు 50 రోజులైంది. నా తర్వాత రిజిస్టర్ చేసుకున్న అధికార పార్టీ వారివి ముందుగానే వచ్చాయి. ఇదెక్కడి న్యాయం. కేంద్రం తెరిచి ఉన్నప్పుడు అధికార పార్టీ నేతల బ్యాక్‌గ్రౌండ్ సిఫార్సులకు ప్రాధాన్యం ఇచ్చి వారినుంచే కొనుగోళ్లు చేశారు. తీరా కేంద్రం మూతపడ్డాకా ఇప్పుడు సన్నా, చిన్నకారు రైతులంటూ చెప్పడం ఎంతవరకు సమంజసం.
– ఘంటా మురళి, పొగాకు రైతు, జాలాది
ఆదుకోవడం అంటే ఇదేనా..?
రూ.22 వేల చొప్పున కౌలుకు తీసుకుని సాగు చేశా. ఎకరానికి రూ.2 లక్షల ఖర్చు అయింది. వర్షాల నుంచి రక్షణకు లక్ష పెట్టి పట్టాలు కొనాల్సి వచ్చింది. వారం నుంచి కేంద్రం ఉండటం లేదు. రోజు కేంద్రం వద్ద కాపాల కూర్చొని వస్తున్నాం. కొంటారో లేదో ఏమీ తెలియకుండా పోయింది. పర్చూరు సమావేశానికి వెళ్లాను. పొగాకు రైతులకు అక్కడ నాయకులు, రైతులకు ఇచ్చిన హామీకి, కేంద్రంలో అధికారులు కొనుగోలు చేస్తున్న దానికి పొంతన లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రంలో ఎక్కువగా కేజీ రూ.60, రూ.90 రేటు ఎక్కువగా వేస్తున్నారు. రూ.120 ధర చాలా తక్కువగా వేయడంపై రైతులు అల్లాడుతున్నారు.
–పెరవలి నాగేశ్వరరావు, పొగాకు రైతు, సొలస
●

పెద్ద రైతులకు ఎక్కువ నష్టం