
అల్లూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
బాపట్ల టౌన్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని యువతరం ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ తుషార్‌డూడీ సూచించారు. అల్లూరి వర్ధంతిని ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ... బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా, మన్యం ప్రజల హక్కుల కోసం సాయుధ పోరాటాన్ని సాగించిన గొప్ప విప్లవకారుడు అల్లూరి అని కొనియాడారు. వీరోచిత సాహస కృత్యాలతో రెండేళ్లపాటు బ్రిటీషర్లకు కంటి మీద కనుకు లేకుండా చేశారన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని నేటి యువత నాయకత్వ లక్షణాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు. అన్యాయాలను ఎదిరించి మంచివైపు నిలబడాలన్నారు. నేరాలను అదుపు చేయడానికి పోలీస్ వారికి సహాయ సహకారాలు అందించాలన్నారు. అడిషనల్ ఎస్పీ టి.పి విఠలేశ్వ ర్, ఎస్‌బీ సీఐ నారాయణ, అడ్మిన్ ఆర్‌ఐ మౌలుద్దీన్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
యువతకు ఎస్పీ తుషార్‌డూడీ సూచన