
చాలా ప్రయత్నాలు చేస్తున్నాం
నేను భారత హాకీ జట్టు క్యాంపులో సాధన చేశాను. అంతర్జాతీయ రిఫరీగా పనిచేస్తున్నాను. జిల్లాలో హాకీకి గ్రహణం పట్టిందా అనిపిస్తుంది. ఎవర్ని అడిగినా చేద్దామంటారేగాని ముందుకు రారు. ప్రస్తుతం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్రీడలపట్ల చొరవ చూపిస్తున్నారు. ఆయనను కలిసి వివరిస్తాను. జాతీయ క్రీడలకు కనీసం మైదానం లేకపోవడమంటే ఇది అవమానమే. గ్రౌండ్ ఇస్తే చాలు మా అసోసియేషన్ నుంచి క్రీడాకారులను, కిట్స్‌ను ఇతర అంశాలకు పూర్తి సహకారమందిస్తాం. మైదానం ఏర్పాటు చేసి, ఒక శాప్ హాకీ కోచ్‌ను ఇవ్వండి. కేవలం రెండు సంవత్సరాలు చూడండి ఎన్ని రిజల్ట్స్ గుంటూరు జిల్లాకు వస్తాయో. హాకీలో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందే వీలుంటుంది.
– జి.హర్షవర్ధన్, హాకీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్.