ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Telugu Horoscope On May 31st To June 6th, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

May 31 2026 4:12 AM | Updated on May 31 2026 10:55 AM

Weekly Horoscope Telugu 31-05-2026 To 06-06-2026

మేషం...
కొత్త వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వాహనయోగం. మీ ప్రతిపాదనలు,ఆలోచనలు అందర్నీ మెప్పిస్తాయి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు దక్కించుకుంటారు. అధికాదాయం ఉత్సాహాన్నిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటిలో ఉత్సాహపూరితంగా ఉంటుంది.  వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు వచ్చే అవకాశం. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు సమస్యలు కొన్ని తీరతాయి. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు.. ఆకస్మిక ప్రయాణాలు. పసుపు, ఎరుపు రంగులు. శివస్తుతి మంచిది.

వృషభం...
రాబడి సంతృప్తినిచ్చినా కొంతవరకూ అప్పులు కూడా చేయాల్సివస్తుంది. సన్నిహితులు, స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగాన్వేషణలో మీదే విజయం. వాహనాలు కొనుగోలు చేస్తారు.  ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి కాగలవు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు సమకూరతారు. పెట్టుబడులకు ఢోకాలేదు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. క్రీడాకారులు, కళాకారులకు  మరింత అనుకూలం. వారం మధ్యలో దూరప్రయాణాలు. కుటుంబ సమస్యలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు..రాఘవేంద్ర ధ్యానం చేయండి.

మిథునం....
కొన్ని సమస్యలు ఎదురైనా సర్దుబాటు కాగలవు. ఆదాయానికి లోటు ఉండదు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యాచరణలో పెడతారు. బంధువులు,స్నేహితులతో  ముఖ్య విషయాలపై చర్చిస్తారు. దేవాలయ దర్శనాలు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు కొంతమేర అందుతాయి. ఉద్యోగులకు శ్రమ పెరిగినా  మంచి గుర్తింపు లభించగలదు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. నీలం, ఆకుపచ్చ రంగులు. ఇంద్రాక్షిస్తుతి మంచిది.

కర్కాటకం...
కొత్త పనుల్లో  విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. బంధువుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కవచ్చు. పాతమిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు.   వ్యాపారులు మరింతగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సత్కారాలు. క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. అనారోగ్య సూచనలు.బాధ్యతలు పెరుగుతాయి. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. శ్రీరామ స్తోత్రాలు పఠించండి..

సింహం...
పరిచయాలు పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి సహాయకారులుగా ఉంటారు. ఉద్యోగార్థుల యత్నాలు సఫలం. ముఖ్యమైన వ్యవహారాలలో  విజయం సాధిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వాహన, కుటుంబసౌఖ్యం. వివాహాది శుభకార్యాలకు సన్నాహాలు చేస్తారు.  వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు కలసివచ్చే సమయం. రాజకీయవేత్తలు, పరిశోధకులు,  కళాకారులకు అంచనాలు నిజం కాగలవు. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. ఆప్తులతో కలహాలు.రుణయత్నాలు. తెలుపు, నేరేడు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

కన్య....
సానుకూల పవనాల మధ్య ముందడుగు వేస్తారు.  శ్రేయోభిలాషుల సలహాలు, సూచనల మేరకు కొన్ని పనులు పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్కుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. శత్రువులు కూడా అనుకూలురుగా మారతారు. వాహనయోగం.  వ్యాపారులు పురోగతి సాధిస్తారు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు క్లిష్ట సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు శ్రమానంతరం ఫలితం ఉంటుంది. పరిశోధకులు, సాంకేతిక రంగాల వారికి చిక్కులు వీడతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. ఒత్తిడులు పెరుగుతాయి. పసుపు, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల....
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. అనుకున్న కార్యాలలో ఆటంకాలు. దేవాలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో విభేదాలు. స్థిరాస్తి విషయంలో కొంత చికాకులు. ఆరోగ్య సమస్యలతో కుస్తీపడతారు. సోదరుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులు ఆశించిన ఫలితాలు కష్టమే. వ్యాపారులకు ఆటుపోట్లు ఎదురైనా కొద్దిపాటి లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో మరిన్ని  బాధ్యతలు పెరుగుతాయి. కళాకారులు, సాంకేతిక నిపుణులకు సమస్యలు. క్రీడాకారులకు ఆశనిరాశల మధ్య గడుస్తుంది.  వారం చివరిలో శుభవార్తలు. విందువినోదాలు. కార్యజయం. స్నేహితులను కలుసుకుంటారు. నలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
అన్ని విధాలా అనుకూల సమయం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులు మరింత సహాయపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కొత్త కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కించుకుంటారు. ఇంటి  నిర్మాణాలు చేపడతారు.  వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు. కళాకారులు, క్రీడాకారుల ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ఆస్తివివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. సంకటనాశక గణపతి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
చేపట్టిన పనులలో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని అప్పులు సైతం తీరుస్తారు. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. దూరమైన బంధువులు  తిరిగి దగ్గరవుతారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. కుటుంబసమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.  వ్యాపారులు కొంతమేర లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు పనిభారం పెరిగినా సత్తా చాటుకుంటారు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. మానసిక అశాంతి. కష్టానికి ఫలితం కనిపించదు. ఎరుపు, తెలుపు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.  

మకరం....
ముఖ్యమైన  పనులు సమయానికి పూర్తి చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శత్రువులు సైతం స్నేహితులుగా మారతారు. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. క్రీడాకారులు, పరిశోధకులకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. కుటుంబంలో ఇబ్బందులు. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఆంజనేయస్వామిని పూజించండి.

కుంభం...
కుటుంబంలో శుభకార్యాల హడావిడి నెలకొంటుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ముఖ్య కార్యక్రమాలు అనుకున్న విధంగా సజావుగా సాగుతాయి. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. దేవాలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. రాజకీయవేత్తలకు మరింత అనుకూలం. పరిశోధకులు, క్రీడాకారులు తమ నైపుణ్యతను నిరూపించుకుంటారు. వారం చివరిలో మనశ్శాంతి లోపిస్తుంది. అనారోగ్యం. దూరప్రయాణాలు. గులాబీ, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు  పఠించండి.

మీనం....
రాబడి కొంత అనుకూలిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు తొలగుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. దూరపు బంధువులను కలుసుకుని  ఉత్సాహంగా గడుపుతారు. వివాహ వేడుకలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తిపై అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగార్ధులు అనుకున్నది సా«ధిస్తారు. తండ్రి తరఫు నుంచి ధనలాభ సూచనలు. వ్యాపారులకు భాగస్వాముల నుంచి ప్రోత్సాహం. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. కళాకారులు, సాంకేతిక నిపుణులు అనుకున్నది సాధిస్తారు. వారాంతంలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, పసుపు రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement