Weekly Horoscope: ఈ రాశి వారు ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు | Weekly Horoscope Telugu 24-07-2022 To 30-07-2022 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశి వారు ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు

Jul 24 2022 7:36 AM | Updated on Jul 29 2022 6:50 AM

Weekly Horoscope Telugu 24-07-2022 To 30-07-2022 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురైనా అవసరాలకు ఏదోవిధంగా కొంత సొమ్ము అందే సూచనలు. స్థిరాస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. వాహనాలు, భూముల కొనుగోలులో అవాంతరాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. వారం మధ్యలో శుభవార్తలు. స్థిరాస్తి లాభం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి.  కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. నిరుద్యోగుల చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. గులాబీ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులు నెమ్మదించినా క్రమేపీ పూర్తి చేస్తారు.  వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఒక ముఖ్య సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు, సమస్యలు తీరే సమయం. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి.  వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో  ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. తెలుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు చకచకా పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఖర్చులు అధికం. శారీరక రుగ్మతలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు.  పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో పురోగతి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో వివాదాలు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అనుకున్న వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తగ్గవచ్చు.  వారం చివరిలో ఆరోగ్యభంగం.  నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి పలుకుబడి పెరుగుతుంది. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయవర్గాలకు ఉన్నత స్థాయి నుంచి పిలుపు అందుతుంది. వారం చివరిలో రుణయత్నాలు.  పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో విభేదాలు తొలగి లబ్ధి చేకూరుతుంది. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. కొన్ని నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరం. వారం మధ్యలో మిత్రుల నుండి ఒత్తిడులు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement