ఈ రాశివారికి ఆలోచనలు స్థిరంగా సాగవు

Today Horoscope Telugu In 17-10-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి శు.ద్వాదశి సా.6.29 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్రం శతభిషం ఉ.11.48 వరకు తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం సా.6.16 నుండి 7.54 వరకు, దుర్ముహూర్తం సా.4.01 నుండి 4.47 వరకు, అమృతఘడియలు... తె.4.42 నుండి 5.34 వరకు.

సూర్యోదయం        :  5.56
సూర్యాస్తమయం    :  5.35
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు:
మేషం.. బంధువులతో సత్సంబంధాలు. ఆర్థిక పరిస్థితి మెరుకుపడుతుంది. విచిత్ర సంఘటనలు. వస్తులాభాలు. ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం.. కొత్త వ్యక్తుల పరిచయం. ఆసక్తికర సమాచారం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

మిథునం.. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు.

కర్కాటకం.. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం.. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య.. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సంఘంలో ఆదరణ. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.

తుల.. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం.. నిర్ణయాలు మార్పుచుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు.. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. యత్నకార్యసిద్ధి. కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మకరం.. కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో కొంత జాప్యం. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారవచ్చు.

కుంభం.. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ముఖ్య కార్యక్రమాలలో విజయం. పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మీనం.. సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top