ఈ రాశి వారు ఆత్మీయుల నుండి శుభవార్తలు వింటారు | Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశి వారు ఆత్మీయుల నుండి శుభవార్తలు వింటారు

Published Sat, Sep 24 2022 6:50 AM

Today Horoscope 24 09 2022 - Sakshi

శ్రీశుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.చతుర్దశి రా.2.35 వరకు తదుపరి అమావాస్య, నక్షత్రం: పుబ్బ తె.5.46 వరకు (తెల్లవారితే ఆదివారం) తదుపరి ఉత్తర, వర్జ్యం: ప.12.44 నుండి 2.24 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.53 నుండి 7.29 వరకు అమృతఘడియలు: రా.10.56 నుండి 12.38 వరకు.

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.54
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా మారుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తాయి. ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. భూవివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కన్య: వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. గతం గుర్తుకు వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్యులతో సంభాషిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

ధనుస్సు: రుణయత్నాలు. కార్యక్రమాలలో అవాంతరాలు. స్వల్ప అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుంభం: శుభవార్తలు వింటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు కొంటారు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మీనం: మీ నిర్ణయాలు మార్చుకుంటారు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

Advertisement
 
Advertisement
 
Advertisement