Today Horoscope: ఈ రాశి వారికి పనులు నెమ్మదిగా సాగుతాయి

Today Horoscope 17-05-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.పాడ్యమి ఉ.8.02 వరకు, తదుపరి విదియ తె.5.44 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం అనూరాధ ప.12.44 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం సా.5.57 నుండి 7.27 వరకు, దుర్ముహూర్తం ఉ.8.04 నుండి 8.55 వరకు, తదుపరి రా.10.47 నుండి 11.32 వరకు, అమృతఘడియలు...రా.2.56 నుండి 4.26 వరకు

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం    :  6.21
రాహుకాలం :  ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు

మేషం....పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృషభం....వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం....మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.

కర్కాటకం...వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి కాగలవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం...కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బం«ధువుల కలయిక. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో వివాదాలు.

కన్య....కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

తుల...రుణదాతల ఒత్తిడులు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ఆటంకాలు. మిత్రులే శత్రువులుగా మారవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సాధారణస్థితి.

వృశ్చికం...కష్టానికి ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.

ధనుస్సు...రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తులు వివాదాలు కొనసాగుతాయి. దూరప్రయాణాలు. బంధుమిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మకరం...చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

కుంభం...బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం....పనుల్లో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top