Today Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే, వస్తు లాభం

Today Horoscope 11 01 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి: బ.చవితి ప.11.34 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: మఖ ఉ.9.37 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: సా.6.15 నుండి 8.01 వరకు, దుర్ముహూర్తం: ప.11.44 నుండి 12.31 వరకు, అమృత ఘడియలు: ఉ.7.01 నుండి 8.44 వరకు; రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు; యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు; సూర్యోదయం 6.38; సూర్యాస్తమయం 5.39. 

మేషం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: మిత్రులతో వైరం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆస్తులు వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

సింహం: కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. వస్తులాభాలు. భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళం. ఇంటాబయటా సమస్యలు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు సైతం అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి.

వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: రుణాలు చేస్తారు. బంధువులు, మిత్రుల నుండి ఒత్తిడులు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

మకరం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కుంభం: కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖుల నుండి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుండి విముక్తి.

మీనం: కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యావకాశాలు. వాహనాలు కొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top