Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు 07-10-2022

Today Horoscope 07-10-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.ద్వాదశి ఉ.6.47 వరకు, తదుపరి త్రయోదశి తె.5.01 వరకు(తెల్లవారితే శనివారం), నక్షత్రం: శతభిషం సా.6.51 వరకు తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.12.58 నుండి 2.30 వరకు దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.03 వరకు, తదుపరి  ప.12.11 నుండి 12.58 వరకు, అమృతఘడియలు: ప.12.00 నుండి 1.31 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.43
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: వ్యవహారాలలో విజయం. ఆస్తులు సమకూర్చుకుంటారు. నూతన విద్యావకాశాలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

వృషభం: నూతన పరిచయాలు. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పనుల్లో విజయం. భూలాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం: చే పట్టిన పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం: ఆర్థికంగా ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో తొందరపాటు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రతికూలత.

సింహం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కన్య: పరిస్థితులు అనుకూలించవు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. 

తుల: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. పనులు చకచకా పూర్తి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు.

మకరం: సన్నిహితులతో వివాదాల పరిష్కారం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు.

కుంభం: మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో మార్పులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top