గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.సప్తమి సా.5.46 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: మృగశిర రా.8.35 వరకు, తదుపరి ఆరుద్ర,వర్జ్యం: తె.4.27 నుండి 5.57 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ప.11.40 నుండి 12.30 వరకు, అమృత ఘడియలు: ప.12.23 నుండి 1.52 వరకు.
సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.... సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు సేకరిస్తారు. దేవాలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృషభం.... కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆదాయానికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో సమస్యలు.ఉద్యోగస్తుల యత్నాలు విఫలం. ఆకస్మిక ప్రయాణాలు.
మిథునం.... పడిన శ్రమ ఫలితమిస్తుంది. కొత్త పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. చిరకాల స్నేహితులు కలుస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం.. కుటుంబసభ్యల నుంచి వ్యతిరేకత. రాబడి అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
సింహం.... వ్యాపారాలలో ముందంజ. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. వాహనాలు కొంటారు. దేవాలయదర్శనాలు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు.
కన్య..... కొత్త కార్యక్రమాలు చేపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విజయాలు.
తుల... కార్యక్రమాలలో ఆటంకాలు. ఇంటాబయటా సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. వ్యాపారులు నిరుత్సాహపడతారు. ఉద్యోగాలలో మార్పులు.
వృశ్చికం... లేనిపోని విమర్శలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. దేవాలయ దర్శనాలు. బంధువులతో అకారణ వైరం. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు పనిభారం.
ధనుస్సు.... సంఘంలో గౌరవమర్యాదలు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు విశేష గుర్తింపు.
మకరం.... నూతన పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు దేవాలయ దర్శనాలు. ఆస్తి లాభం. యత్నకార్యసిద్ధి. గృహ నిర్మాణాలు చేపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో ఎదురుండదు.
కుంభం.. కొత్తగా అప్పులు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. శారీరక రుగ్మతలు.
మీనం... ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు చిక్కులు. కార్యక్రమాలలో అవాతంరాలు. దైవదర్శనాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు నిలకడగా ఉండవు.


